సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ఊహించని ట్విస్ట్.. షాక్ లో పోలీసులు

by  |
సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ఊహించని ట్విస్ట్.. షాక్ లో పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఆ గ్యాంగ్ రేప్ అంతా యువతి నాటకమని పోలీసులు తేల్చి చెప్పేసారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్ళి తనను గ్యాంగ్ రేప్ చేసారంటూ యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటినా నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. విచారణలో పోలీసులే షాకయ్యే నిజాలు వెలుగుచూశాయి.

యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!

యువతి ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉన్న పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ఎక్కడా అనుమానకరమైన దృశ్యాలు కనిపించలేదు. ఇక సంఘటనా స్థలంలో కూడా కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు దొరకలేదు. మెడికల్ రిపోర్టులోనూ అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో పోలీసులు యువతిని తమదైన రీతిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టడంతో పోలీసులు ఖంగుతిన్నారు. యువతి ప్రియుడు తనను కాదని వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడని, అతనిని ఎలాగైనా కేసులో ఇరికించడానికే రేప్ డ్రామా ఆడినట్లు యువతి తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి.

Next Story