- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరస్తుడిని పట్టించిన మట్టి గుర్తులు
<p>దిశ, హుస్నాబాద్: మట్టి, వాహనం గుర్తుల ఆధారంగా పోలీసులు నేరస్తుడిని పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రవి వివరాల ప్రకారం… అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన గొర్ల సదయ్య(40) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సదయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. […]</p>

X
దిశ, హుస్నాబాద్: మట్టి, వాహనం గుర్తుల ఆధారంగా పోలీసులు నేరస్తుడిని పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రవి వివరాల ప్రకారం… అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన గొర్ల సదయ్య(40) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సదయ్య అక్కడికక్కడే మృతిచెందారు.
ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదయ్య మృతి చెందిన ప్రాంతంలో మట్టి, వాహనం గుర్తులే నేరస్తుడిని పట్టించాయన్నారు. మట్టిని సేకరించి మండల పరిధిలోని పలు పంట పొలాలతో పాటు పలువురి ట్రాక్టర్ టైర్లకు ఉన్న మట్టిని పరిశీలించారు. అనంతరం, అక్కన్నపేట మండలం జనగాం గ్రామానికి చెందిన గంపల సతీష్ అను వ్యక్తి ఢీ కొట్టినట్టు ఎస్ఐ చెప్పారు.
Next Story






