బోన్సాయ్ చెట్టు చోరీ నిందితుల గుర్తింపు

62

దిశ, క్రైమ్ బ్యూరో : జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో దొంగలు ఎత్తుకెళ్లిన బోన్సాయ్ చెట్టును పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. తన ఇంటి ఆవరణలో గత 15 ఏండ్లుగా పెంచుకుంటున్న బోన్సాయ్ చెట్టు చోరీకి గురైనట్టు మాజీ సీనియర్ ఐపీఎస్ సతీమణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 18 లోని మాజీ డీజీపీ అప్పారావు నివాసం ముందు బోన్సాయ్ మొక్కలను నిందితులు అనేక సార్లు గమనించారు. ఈ మొక్కలకు మంచి డిమాండ్ ఉండటంతో అవసరమైన వినియోగదారులకు విక్రయించి, డబ్బు అర్జించాలని నిందితులు భావించారు.

దీంతో ఈ నెల 10న బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 15 సంవత్సరాల బోన్సాయ్ చెట్టును చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. టూ వీలర్ నెంబరుతో యూసుఫ్‌గూడ ఎస్పీఆర్ హిల్స్ ఓంనగర్‌లో నివసించే గొల్లపుడి ప్రసన్నాంజనేయులు, అభిషేక్‌లు ఈ చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఏ1 ప్రసన్నాంజనేయులును పోలీసులు అరెస్టు చేయగా, ఏ2 అభిషేక్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి బోన్సాయ్ చెట్టును స్వాధీనం చేసుకున్నట్టు జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ ఎ.రమేశ్ శుక్రవారం తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..