తుపాకుల మాయం కేసు నాపై నెడదామనుకున్నారు: రిటైర్డ్ సీఐ

by  |
తుపాకుల మాయం కేసు నాపై నెడదామనుకున్నారు: రిటైర్డ్ సీఐ
X

పోలీసు బాసులు ఇప్పటికైనా కళ్లు తెరిచి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి తుపాకులు మాయమైన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి అసలు దొంగలను గుర్తించాలని రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అక్కన్నపేటలో సదానందం కాల్పులకు పాల్పడడంతో ఆ తుపాకులు ఎక్కడున్నాయో తెలిసిందని అన్నారు.

ఆయధాలు చోరికీ గురి కావడం వెనక నిర్లక్ష్యం ఎవరిదో కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. హుస్నాబాద్ నుంచి తాను బదిలీ అయిన రెండు నెలల తర్వాత తుపాకులు మాయమయ్యాయాని ఆయన వెల్లడించారు. అయితే ఆ తుపాకుల మాయం ఘటనను తనతో పాటు తన గన్ మెన్‌పై నెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తుపాకీ తూటా పోతేనే కఠినంగా వ్యవహరించే డిపార్ట్ మెంట్ రెండు తుపాకులు పోయినా ఇంతవరకు ఎవరిపైనా ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదని తాను నాటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నానని ఆయన తెలిపారు.

అక్కన్నపేట ఘటనలో ఏకే 47ను సదానందం ఆటో మోడ్‌లో పెట్టి ఫైర్ ఓపెన్ చేసి ఉంటే ఎంతో విధ్వంసం జరిగేదన్న భూమయ్య, ఆ తుపాకులు నక్సల్స్ లేదా టెర్రరిస్టుల చేతికి చిక్కి ఉంటే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవో ఊహించాలని ఆయన కోరారు. హుస్నాబాద్ పీఎస్ గార్డ్‌ను తొలగించడంతో పాటు అప్పటి ఎస్సై నిర్లక్ష్యమే తుపాకుల చోరీకి కారణం అయి ఉంటుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సదానందం కాల్పులు జరపకపోయి ఉంటే ఆ నింద ఇంకా నింద ఇంకా తనపైనే ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సిద్ధిపేట సీపీ శివకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకులు మాయమైతే వెంటనే కేసు పెట్టకుండా జోయల్ డేవీస్ సీపీగా జాయిన్ అయ్యే వరకు కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. తానెలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా నిర్ధారణ అయిందని, అది సమాజానికి కూడా తెలిసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అప్పటి సీపీ శివకుమర్‌తో తనకు వచ్చిన విబేధాల కారణంగానే తనను బలిపశువును చేసే ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ ముందు ఉండే ఓ చిరు హోటల్ యజమాని ఎల్లమ్మ కొడుకు హోంగార్డు రాజుపై వరకట్న వేదింపుల కేసు నమోదు చేస్తే అప్పటి అక్కడ పనిచేసిన పోలీసులు లక్షా 5 వేల రూపాయల లంచం తీసుకున్నారని, దీనిపై తాను స్టేట్ మెంట్ రికార్డ్ చేసి సీపీ శివకుమార్‌కు నివేదిక పంపిస్తే చర్యలు తీసుకోలేదన్న భూమయ్య, ఆ లంచం సొమ్ము ఎల్లమ్మకు తిరిగి ఇప్పించానన్న కోపం కూడా అప్పటి పోలీసు అధికారులకు ఉండి ఉంటుందని భూమయ్య అంచనా వేశారు. సదానందంపై ఆయన భార్య కేసు వేసినప్పుడు విచారణలో భాగంగా తరచూ పోలీస్ స్టేషన్‌కి వచ్చేవాడని ఆయన తెలిపారు. అలా వచ్చినప్పుడు తనకు తుపాకీ కావాలని అడిగేవాడంటే అతనికి క్రిమినల్ ఆలోచన ఉన్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు.

ఇంతవరకు దాసరి భూమయ్య అనగానే తుపాకులు ఎత్తుకెళ్లిన వ్యక్తిగా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చూసేవారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు నిజానిజాలు బయటపడడంతో తనపై ఉన్న అపప్రధను తొలగించుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారు.



Next Story

Most Viewed