శిశువు మృతి… సూపరింటెండెంట్‌పై కేసు

by Sridhar Babu |

<p>దిశ, హుజురాబాద్: ఆస్పత్రి వైద్యులు, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మృతిచెందిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే&#8230; కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం అడ్మిన్ అయిన వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన చెన్నూరు సంధ్య విషయంలో ఆసుపత్రి వైద్యులు, సూపరిండెంట్ నిర్లక్ష్యం చేయడంతోనే శిశువు మరణించాడని, ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు [&hellip;]</p>

శిశువు మృతి… సూపరింటెండెంట్‌పై కేసు
X

దిశ, హుజురాబాద్: ఆస్పత్రి వైద్యులు, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మృతిచెందిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం అడ్మిన్ అయిన వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన చెన్నూరు సంధ్య విషయంలో ఆసుపత్రి వైద్యులు, సూపరిండెంట్ నిర్లక్ష్యం చేయడంతోనే శిశువు మరణించాడని, ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దీంతో శిశువును పోస్టుమార్టంకు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో శిశువు తండ్రి చెన్నూరు తిరుపతి ఫిర్యాదు చేయడంతో, సూపరింటెండెంట్, డాక్టర్స్‌పై 304(A) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Next Story