- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీన్ రీ కన్‌స్ట్రక్షన్.. మర్డర్ స్పాట్‌కు నిందితులు
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మర్డర్ స్పాట్‌కు తీసుకెళ్లారు. హత్య జరిగిన ప్రాంతంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. మధ్యాహ్నం నుంచి కోర్టులో హాజరు పరుస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. రాత్రి తొమ్మిది అయినా నిందితులను కోర్టులో హాజరుపర్చలేదు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పర్చేందుకు మీన మేషాలు లెక్కిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం నుంచి […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మర్డర్ స్పాట్‌కు తీసుకెళ్లారు. హత్య జరిగిన ప్రాంతంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. మధ్యాహ్నం నుంచి కోర్టులో హాజరు పరుస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. రాత్రి తొమ్మిది అయినా నిందితులను కోర్టులో హాజరుపర్చలేదు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పర్చేందుకు మీన మేషాలు లెక్కిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం నుంచి సస్పెన్స్ సినిమాను తలపించే విధంగా నిందితులను కోర్టులో హాజరు పర్చే తంతు సాగుతోంది. నిందితుల కుటుంబ సభ్యులు మంథని కోర్టులో మధ్యాహ్నం నుండి ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా నిందితులను కోర్టుకు తీసుకవస్తారని ఎదురు చూస్తున్నా ఇంతవరకూ నిందితులను కోర్టుకు తీసుకరాకపోవడంపై చర్చ సాగుతోంది. అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే నిందితులను కోర్టులో హాజరు పర్చాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఒక రోజు దాటినా కోర్టులో హాజరు పర్చకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.






