- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ ‘పసిడి’ తాకట్టు..
by Vemula.Srinu Prasad |
<p>నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకులను మోసం చేసిన కేసులో చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 15ఖాతాల ద్వారా నకిలీ నగలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ.కోటి20లక్షల మేర రుణం పొందినట్టు పోలీసులు నిర్దారించారు. బ్యాంకుల అంతర్గత తనిఖీల్లో ఈ విషయం వెల్లడి కాగా వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అతడు తాకట్టు పెట్టిన 5కిలోల […]</p>
X
నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకులను మోసం చేసిన కేసులో చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 15ఖాతాల ద్వారా నకిలీ నగలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ.కోటి20లక్షల మేర రుణం పొందినట్టు పోలీసులు నిర్దారించారు. బ్యాంకుల అంతర్గత తనిఖీల్లో ఈ విషయం వెల్లడి కాగా వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అతడు తాకట్టు పెట్టిన 5కిలోల నకిలీ ఆభరణాలు, పలు కీలక సాక్ష్యాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.ఇదిలా ఉండగా ఈ రుణాల సేకరణలో బ్యాంకు అధికారులు ఎవరిదైనా హస్తముందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.
Next Story






