- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దివ్య హత్యకేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నిందితులపై పలు సెక్షన్లతో పాటు మహిళల అక్రమ రవాణాచట్టం 201, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసు పూర్వపరాలను ఓ సారి పరిశీలించినట్టయితే.. దివ్య సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. తల్లి చనిపోవడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నిందితులపై పలు సెక్షన్లతో పాటు మహిళల అక్రమ రవాణాచట్టం 201, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసు పూర్వపరాలను ఓ సారి పరిశీలించినట్టయితే.. దివ్య సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. తల్లి చనిపోవడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన పిన్ని క్రాంతివేణి సంరక్షణలోనే పెరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య ఆ తర్వాత అతడితో విడిపోయింది. అనంతరం దివ్యను విశాఖలోని అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో ఉంటున్న వసంత ఇంటికి క్రాంతివేణి పంపింది. ఈ క్రమంలో తన ఇంట్లో ఉంటున్న దివ్యతో వసంత అసాంఘిక కార్యకలాపాలు చేయించింది. దీని ద్వారా వచ్చిన డబ్బు పంపకాల విషయంలో ఇద్దరికీ విభేదాలు వచ్చాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని దివ్య నిర్ణయించుకుంది. అందంగా ఉన్నాననే ఉద్దేశంతోనే దివ్య తనను ఎదురిస్తోందని భావించిన వసంత.. ఆమెపై తీవ్రమైన ద్వేషం పెంచుకుంది. దీంతో తన సోదరి మంజు అలియాస్ సంధ్య, తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్‌లతో పాటు మరో ఇద్దరితో కలిసి దివ్యను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా దివ్యను బంధించి ఆమె కనుబొమ్మలు తీసేసి, గుండు గీయించి అందవిహీనంగా చేశారు. అంతటితో ఆగకుండా శరీరంపై వాతలు పెట్టారు. కనీసం తినడానికి తిండి కూడా పెట్టలేదు. ఇలా రెండు రోజులపాటు నరకం చూపించారు. దీంతో తీవ్రంగా నీరసించిన దివ్య.. నరయాతనను తట్టుకోలేక ఈ నెల 3 ప్రాణాలు విడిచింది. అనారోగ్యంతో మృతిచెందిందని స్థానికులను నమ్మించి, అంత్యక్రియలకు సిద్ధమవ్వగా విషయం పోలీసులకు తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దివ్య హత్యకు గురైందని నిర్ధారించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కాగా, దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మలు కూడా 2015లో హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు.






