- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశీ భామలతో రేవ్ పార్టీ.. రంగంలోకి పోలీసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: నార్త్ గోవాలో జరిగిన రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. అంతేకాదు.. ఇదే పార్టీలో నిర్వాహకుడు ఏకంగా ఫారన్ అమ్మాయిలను దించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిర్వహకుడితో పాటు మరో 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్త్ గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ పరిధి వగటోర్‌లో ఓ వ్యక్తి టూరిస్టులను ఆకట్టుకునేందుకు రేవ్ పార్టీ నిర్వహించాడు. రేవ్ పార్టీలో డ్యాన్సులు వేసేందుకు రష్యకు చెందిన ఇద్దరు యువతులతో పాటు.. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నార్త్ గోవాలో జరిగిన రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. అంతేకాదు.. ఇదే పార్టీలో నిర్వాహకుడు ఏకంగా ఫారన్ అమ్మాయిలను దించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిర్వహకుడితో పాటు మరో 23 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నార్త్ గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ పరిధి వగటోర్‌లో ఓ వ్యక్తి టూరిస్టులను ఆకట్టుకునేందుకు రేవ్ పార్టీ నిర్వహించాడు. రేవ్ పార్టీలో డ్యాన్సులు వేసేందుకు రష్యకు చెందిన ఇద్దరు యువతులతో పాటు.. చెక్ రిపబ్లికన్‌కి చెందిన విదేశీ యువతిని తీసుకొచ్చాడు.
సరిగ్గా పార్టీ జరిగే సమయానికి సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిర్వహకుడితో పాటు పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో లక్షలు విలువ చేసే డ్రగ్స్ కూడా బయటపడ్డాయి. దీంతో పార్టీలో పాల్గొన్న వారిని విచారించగా టూరిస్టులుగా వెల్లడైంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.






