గుంటూరులో ఉద్రిక్తత.. నారా లోకేశ్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-10-10 16:56:12  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా పరమయ్యగుంటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్ వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మాజీ మంత్రులు ప్రత్తిపాటి, ఆనంద్‍బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రలను వేర్వేరు పీఎస్‍లకు […]</p>

nara lokesh arrest
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా పరమయ్యగుంటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్ వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మాజీ మంత్రులు ప్రత్తిపాటి, ఆనంద్‍బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రలను వేర్వేరు పీఎస్‍లకు తరలించారు.

ఇకపోతే లోకేశ్ వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరామర్శ అనంతరం లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story