బొమ్మకల్ సర్పంచ్ అరెస్ట్.. ‘ఆ’ ఆరోపణలే కారణం..

by Sridhar Babu |   (  Updated:2020-08-03 11:16:14  IST  )

<p>దిశ, కరీంనగర్: భూ దందా వ్యవహారంలో బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అక్రమాలకు చెక్ పెట్టాలని బాధిత సంఘం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఆందోళన చేశారు. ఇటీవల కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా గ్రామ వీఆర్వో అసిస్టెంట్ ఇంటిపై దాడి చేసి బొమ్మకల్ గ్రామానికి సంబంధించిన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌పై 9 కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో శ్రీనివాస్ పై [&hellip;]</p>

బొమ్మకల్ సర్పంచ్ అరెస్ట్.. ‘ఆ’ ఆరోపణలే కారణం..
X

దిశ, కరీంనగర్: భూ దందా వ్యవహారంలో బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అక్రమాలకు చెక్ పెట్టాలని బాధిత సంఘం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఆందోళన చేశారు.

ఇటీవల కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా గ్రామ వీఆర్వో అసిస్టెంట్ ఇంటిపై దాడి చేసి బొమ్మకల్ గ్రామానికి సంబంధించిన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌పై 9 కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో శ్రీనివాస్ పై పీడి యాక్డు కూడా పెట్టేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

Next Story