- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్ పోలీసుల అదుపులో మల్లన్న టీం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన సామాజిక ఉద్యమకారుడు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులను, మంగళవారం కరీంనగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న అరెస్ట్‌ను నిరసిస్తూ నగరంలోని గీతా భవన్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు హెచ్చరించినా, వినకుండా, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో రెండో పట్టణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు మల్లన్న మద్దతుదారులకు […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన సామాజిక ఉద్యమకారుడు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులను, మంగళవారం కరీంనగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న అరెస్ట్‌ను నిరసిస్తూ నగరంలోని గీతా భవన్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు హెచ్చరించినా, వినకుండా, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో రెండో పట్టణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు మల్లన్న మద్దతుదారులకు మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. అదుపులోకి తీసుకున్న వారిలో జిల్లా కో కన్వీనర్ అఖిల్ పాషా, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్, వెంకటేష్, రాములు, రవితో పాటు పలువురు ఉన్నారు.
- Tags
- Arrest
- Karimnagar
Next Story






