సీఎం టూర్.. భూ నిర్వాసితుల ముందస్తు అరెస్టులు

by Shyam |   (  Updated:2021-06-19 23:40:46  IST  )

<p>దిశ ప్రతినిధి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. దీంతో సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ రద్దు చేయాలని సిద్దిపేట రూరల్ మండలం [&hellip;]</p>

farmers arrest
X

దిశ ప్రతినిధి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. దీంతో సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ రద్దు చేయాలని సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి, బండచేర్లపల్లి గ్రామాల రైతులు గతంలో దీక్ష చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిర్వాసితులు సీఎం పర్యటనలో ఏమైనా ఇబ్బందులు సృష్టిస్తారేమోనని భావించిన పోలీసులు రెండు గ్రామాల రైతులను ముందస్తుగా అరెస్ట్ చేసి చిన్న కోడూరు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ఎన్ని అరెస్టులు చేసిన తమ నిర్ణయాన్ని మార్చుకోమన్నారు. తమకు అన్యాయం చేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతేగాకుండా.. పలు జిల్లా్లో నేడు కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story