- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్టు
<p>దిశ, మహబూబ్నగర్: హాస్పిటల్‌లో బాలిక మృతదేహాన్ని ఓ యువకుడు వదిలి వెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలికపై ఇద్దరు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బుధవారం ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ బాలిక, సాయికృష్ణ మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ నెల 27న సదరు […]</p>

దిశ, మహబూబ్నగర్: హాస్పిటల్‌లో బాలిక మృతదేహాన్ని ఓ యువకుడు వదిలి వెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలికపై ఇద్దరు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బుధవారం ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ బాలిక, సాయికృష్ణ మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ నెల 27న సదరు బాలికను సాయికృష్ణ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటకు తెలిస్తే ప్రమాదం అని భావించిన ఆ ఇద్దరు పురుగుల మందు తాగించి బాలికను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వదిలించుకునే క్రమంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి పరారయ్యారు. ప్రధాన నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ఇద్దరు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అపూర్వ తెలిపారు.
tag: SP Apoorva rao, Minor Girl Death case, mysterious, investigating, wanaparthy






