- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా.. అక్కడ ముమ్మర తనిఖీలు
by Shyam |
<p>దిశ, వాజేడు: మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా.. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో టేకులగూడెం 163 జాతీయ రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. రహదారిపై వేళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. అపరిచిత వ్యక్తుల చిరునామాలను సేకరిస్తున్నట్లు సమచారం. సరిహద్దులోని గిరిజన గ్రామాల్లో పోలీసు బలగాలతో గస్తీ తిరుగుతూ.. […]</p>

X
దిశ, వాజేడు: మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా.. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో టేకులగూడెం 163 జాతీయ రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. రహదారిపై వేళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. అపరిచిత వ్యక్తుల చిరునామాలను సేకరిస్తున్నట్లు సమచారం. సరిహద్దులోని గిరిజన గ్రామాల్లో పోలీసు బలగాలతో గస్తీ తిరుగుతూ.. ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో సంచరించినట్లైతే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story






