- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడుంబా స్థావరాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారుల దాడులు
<p>దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడ, రేణ్య తండాలో ఎక్సైజ్, పోలీసులు ఇరువురు మూకుమ్మడిగా దాడులు చేపట్టారు. పెద్ద ఎత్తున గుడుంబా స్థావరాల్ని కనిపెట్టారు. గుడుంబా పెడుతున్నారన్న పక్కా సమాచారం అందుకున్న గూడూరు ఎక్సయిజ్ సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడ ఎస్సై నగేష్ తన సిబ్బందితో చేరుకొని మొండ్రాయిగూడ పరిసరాల్లో, రేణ్య తండా, మొండ్రాయిగూడ మామిడితోట, ఊరి చివరి వాగులో, తండాలోని ప్రతీ ఇంటిలో తనిఖీ […]</p>

దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడ, రేణ్య తండాలో ఎక్సైజ్, పోలీసులు ఇరువురు మూకుమ్మడిగా దాడులు చేపట్టారు. పెద్ద ఎత్తున గుడుంబా స్థావరాల్ని కనిపెట్టారు. గుడుంబా పెడుతున్నారన్న పక్కా సమాచారం అందుకున్న గూడూరు ఎక్సయిజ్ సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడ ఎస్సై నగేష్ తన సిబ్బందితో చేరుకొని మొండ్రాయిగూడ పరిసరాల్లో, రేణ్య తండా, మొండ్రాయిగూడ మామిడితోట, ఊరి చివరి వాగులో, తండాలోని ప్రతీ ఇంటిలో తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడుంబా డ్రమ్ములు ధ్వంసం చేశారు. నిల్వ నాన బెట్టిన బెల్లం పానకం, గుడుంబా స్వాధీనం చేసుకొని పలువురి పై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో వరంగల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిషోర్ బాబు, ఎస్సై చంద్రమౌళి, కిరణ్, బుచ్చయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






