- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా చేపలు మృత్యువాత.. విషప్రయోగం చేశారని అనుమానం?
<p>దిశ, కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం చేరుకూరు గ్రామంలోని ఈదుల చెరువులో ఆదివారం భారీగా చేపలు మృత్యువాతపడ్డాయి. చెరువులో విషప్రయోగం జరిగిందని మండల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెల్దండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఈదుల చెరువులో చేప పిల్లలు తెచ్చి వేశాము. ఇటీవల చేపలు పట్టే సమయంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేపలు పట్టారాదని అడ్డుకున్నారు. ఇప్పుడు […]</p>

X
దిశ, కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం చేరుకూరు గ్రామంలోని ఈదుల చెరువులో ఆదివారం భారీగా చేపలు మృత్యువాతపడ్డాయి. చెరువులో విషప్రయోగం జరిగిందని మండల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెల్దండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఈదుల చెరువులో చేప పిల్లలు తెచ్చి వేశాము. ఇటీవల చేపలు పట్టే సమయంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేపలు పట్టారాదని అడ్డుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో చేపలన్నీ చనిపోయి ఉన్నాయి. చేపలు పట్టకుండా ఆరోజు అడ్డుకున్న వారిపైనే అనుమానం ఉంది.’’ అని బాధితులు అనుమానితులపై ఫిర్యాదు చేశారు. దాదాపు 40 శాతం చేపలు చనిపోయినట్లు తెలిపారు. ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.
Next Story






