- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన తల్లి
<p>దిశ, వెబ్ డెస్క్ : అమ్మ తిపిస్తుంది గోరుముద్దలు అనుకున్నారు. కానీ అది విషమని ఆ చిన్నారులకు ఏం తెలుసు.. అమ్మ పెట్టింది తిని శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనుకున్నారేమో.. ముగ్గురు అన్నదమ్ములు ఓకేసారి ఈ లోకాన్ని విడిచారు. నా వంశం నిలబెట్టడానికి ముగ్గురు కొడుకులున్నారని మురిసిపోయిన ఆ తండ్రికి పుట్టెడు శోకాన్ని మిగల్చారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లా పెండ్లి మర్రి మండల పరిధిలో […]</p>

దిశ, వెబ్ డెస్క్ : అమ్మ తిపిస్తుంది గోరుముద్దలు అనుకున్నారు. కానీ అది విషమని ఆ చిన్నారులకు ఏం తెలుసు.. అమ్మ పెట్టింది తిని శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనుకున్నారేమో.. ముగ్గురు అన్నదమ్ములు ఓకేసారి ఈ లోకాన్ని విడిచారు. నా వంశం నిలబెట్టడానికి ముగ్గురు కొడుకులున్నారని మురిసిపోయిన ఆ తండ్రికి పుట్టెడు శోకాన్ని మిగల్చారు.
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లా పెండ్లి మర్రి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. గొరుముద్దలు తినిపించాల్సిన చేతులతోనే విషమిచ్చింది ఓ కసాయి తల్లి. కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన తల్లి మూడేళ్లలోపు ముగ్గురు చిన్నారులకు విషమిచ్చిన అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే భర్త కూలి పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. దీనికి కారణం కుటుంబ కలహాలే అటున్న కుటంబ సభ్యులు. పసిపిల్లల మృతితో పెను విషాదంలో మునిగిపోయింది ఆ కుటుంబం.






