వడ్డీ రేట్లను సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

65

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీని బ్యాంకు కొనసాగిస్తోంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి కాలానికి మెచ్యూర్ అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందించనున్నట్టు, సవరించిన వడ్డీ రేట్లు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిటర్లపై 0.5 శాతం అదనపు వడ్డీ పొందవచ్చని, వీరికి 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ లభిస్తుందని పేర్కొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..