పీఎన్‌బీ వినియోగదారులకు శుభవార్త!

by  |
పీఎన్‌బీ వినియోగదారులకు శుభవార్త!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వినియోగదారులకు శుభవార్త అందించింది. పీఎన్‌బీ రెపో లింక్డ్ లెండింగ్ రేట్లు( ఆర్ఎల్ఎల్ఆర్)‌లో 40 బేసిస్ పాయింట్ల మేర కోతను విధిస్తున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించింది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 7.05 శాతం నుంచి 6.65 శాతానికి తగ్గింది. అంతేకాకుండా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) కూడా 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అన్ని రకాల కాల పరిమితుల్లోని రుణాలకు ఇది వర్తిస్తోందని పేర్కొంది. ఆర్ఎల్ఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ తగ్గింపు నేపథ్యంలో రుణం తీసుకున్న వారిపై ఈఎమ్ఐ భారం తగ్గనుంది. అలాగే కొత్త రుణాలను తీసుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి. సవరించిన ఈ రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వీటితోపాటు, సేవింగ్ డిపాజిట్ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించడంతో, ఈ రేటు 3.25 శాతానికి తగ్గింది. దీంతో డిపాజిట్ చేసేవారికి తక్కువ రాబడి వస్తుంది. ఇది వినియోగదారులకు చేదు కబురు. ఇంకా, బ్యాంక్ టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా తగ్గిస్తున్నట్టు నిర్ణయించింది. దీంతో, బ్యాంక్ ఎఫ్‌డీలపై గరిష్టంగా 5.5 శాతం వరకూ వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ మాత్రం ఎక్కువ వడ్డీ అందుతుంది. సాధారణ వినియోగదారుల కంటే వీరికి 75 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభించనుంది.


Next Story

Most Viewed