ఇండ్ల పథకానికి నేడు పీఎం శ్రీకారం

94

దిశ,వెబ్‌డెస్క్: యూపీలో ఇండ్ల పథకానికి నేడు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. పీఎంవై-జీ పథకం కింద యూపీకి రూ.2691 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక సాయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6.1లక్షల మంది గ్రామీణ పేదలకు లబ్ది చేకూర నుంది. తొలి విడతలో 5.30 లక్షల మంది, రెండో విడతలో 80 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.26 కోట్ల ఇండ్లు నిర్మించినట్టు పీఎంవో తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..