ప్రధాని మోడీ ఇవాళ్టి షెడ్యూల్

130

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని మళ్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ రోజు ఆయన పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఈ రెండు చోట్లా బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ప్రసంగించనున్నారు. పుదుచ్చేరిలోనీ ఏఎఫ్‌టీ తిడాల్ పర్యటించి ఎన్‌డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనునున్నారు.

ఇప్పటికే ప్రధాని ఫిబ్రవరి 25న పుదుచ్చేరి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు ప్రచారం చేశారు. తాజాగా మోడీ పర్యటన సందర్భంగా పుదుచ్చేరిలో డ్రోన్‌లపై నిషేధం విధించారు. ప్రధాని ఇదే రోజు తమిళనాడులోని ధారాపురానికీ వెళ్లనున్నారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్ మురుగన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న స్థానం ధారాపురంలో ప్రచారం చేయనున్నారు. పుదుచ్చేరి, తమిళనాడులలో వచ్చే నెల 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..