మోడీ అధ్యక్షతన రేపు మరో కీలక సమావేశం

by Shamantha N |   (  Updated:2021-08-08 09:10:09  IST  )

<p>న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ‘మెరుగైన సముద్ర భద్రత-అంతర్జాతీయ సహాకారం’ అనే అంశంపై రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతమండలి లోని ఉన్నతాధికారులు, ప్రాంతీయ సంస్థలు, పలు రాష్ర్టాలకు చెందిన పెద్దలు హాజరవనున్నట్లు తెలుస్తోంది. సముద్ర నేరాలు, భద్రత పరమైన అంశాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పీఎం కార్యాలయ అధికారి తెలిపారు. ఐరాస భద్రతమండలితో చర్చ జరిపే మొదటి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. ఏ దేశం [&hellip;]</p>

మోడీ అధ్యక్షతన రేపు మరో కీలక సమావేశం
X

న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ‘మెరుగైన సముద్ర భద్రత-అంతర్జాతీయ సహాకారం’ అనే అంశంపై రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతమండలి లోని ఉన్నతాధికారులు, ప్రాంతీయ సంస్థలు, పలు రాష్ర్టాలకు చెందిన పెద్దలు హాజరవనున్నట్లు తెలుస్తోంది. సముద్ర నేరాలు, భద్రత పరమైన అంశాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పీఎం కార్యాలయ అధికారి తెలిపారు. ఐరాస భద్రతమండలితో చర్చ జరిపే మొదటి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. ఏ దేశం కూడా సముద్ర భద్రతపై స్వంత నిర్ణయాలు తీసుకోదని, భద్రత మండలితో సమావేశం ముఖ్యమైన అంశం పరిగణించాలని ఆయన చెప్పారు. దీంతో ఇతర దేశాల బెదిరింపులకు లొంగకుండా చట్టబద్ధంగా సముద్ర కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Next Story