జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ

32
Prime Minister Modi to attend G7 summit

న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ, 13వ తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 7 దేశాల అగ్రనేతలతో ఈ నెల 12న యూకేలో జీ7 సదస్సు మొదలుకాబోతున్నది. దీనికి భారత్ సహా ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా యూకే ఆహ్వానించింది. కరోనానంతరం ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ మార్పు నియంత్రణ, పరస్పర సహకారాలు ప్రధానాంశాలుగా ఈ సదస్సు జరగనుంది. 2019లోనూ ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని జీ7 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..