సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

by  |
సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేవ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ స్పీకర్ ఓం బిర్లా జగన్ కు తెలుగులోకి విసెష్ చెప్పారు. ఇక యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ శ్రీ గౌరవ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్ జగన్ గారు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి.. ప్రజా సేవలో జీవితాంతం కొనసాగాలి అన్న’అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవచేయాలంటూ కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed