- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘శంకర్ దాదా’ సింగర్ కన్నుమూత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆదివారం మృతిచెందినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. అయితే, వినాయగం సింగర్‌గానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు. ‘దిల్’ (2001) అనే తమిళ చిత్రంతో సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మాణిక్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆదివారం మృతిచెందినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. అయితే, వినాయగం సింగర్‌గానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు.
‘దిల్’ (2001) అనే తమిళ చిత్రంతో సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మాణిక్య వినాయగం అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
Next Story






