బద్వేల్‌లో వేయి కోట్లతో ప్లాంటు: సీఎం జగన్‌తో భేటి అయిన కంపెనీ ప్రతినిధులు

by  |
cm-jagan-meet d
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షాలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో భారతదేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన సెంచరీ ఇండియా బద్వేలులో నూతన ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయనుంది. 3,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు ఈ కంపెనీ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. 2024 డిసెంబర్‌ కల్లా మూడు దశల్లో నిర్మాణం పూర్తికానుందని తెలుస్తోంది. ఏడాదికి 4,00,000 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10,00,000 మెట్రిక్‌ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యంతో ఉత్పత్తులు ప్రారంభించనుంది. రైతులతో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్ళుపై గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్ధికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవన్‌ పాల్గొన్నారు.


Next Story

Most Viewed