- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్‌కు సంతాపం
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. విఠల్ మృతి తెలంగాణకు తీరని లోటు అని, ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆరు దశాబ్దాల కిందటే ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ఎలుగెత్తి చాటిన ఘనుడు బీపీఆర్ విఠల్ అని, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనే […]</p>
దిశ, న్యూస్ బ్యూరో: ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. విఠల్ మృతి తెలంగాణకు తీరని లోటు అని, ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆరు దశాబ్దాల కిందటే ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ఎలుగెత్తి చాటిన ఘనుడు బీపీఆర్ విఠల్ అని, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణ సర్ ప్లస్ .. ఏ కేస్ స్టడీ..అంటూ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలుపుతూ విఠల్ పుస్తకాన్ని రాశారని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.బీపీఆర్ విఠల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.
Next Story






