‘దిశ’ ఎఫెక్ట్.. రోడ్డుకు మరమ్మతులు

by  |
‘దిశ’ ఎఫెక్ట్.. రోడ్డుకు మరమ్మతులు
X

దిశ, పిట్లం: ‘పిట్లం-రోడ్డు పూర్తి చేయరూ’.. అని దిశ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపీపీ కవిత విజయ్ తాత్కాలిక మరమ్మతులు పూనుకొని కుర్తి నుంచి సిద్దాపూర్ వరకు రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడుస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ, సిద్దాపూర్ నుండి కుర్తి వరకు రోడ్డు అంతా గుంతల మయంగా తయారయిందని, వర్షకాలం కావడంతో గుంతలలో నీరు నిండి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, గుంతలను తాత్కాలికంగా మొరం వేసి పూడుస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉందని రోడ్డు దుస్థితిని వివరించి అనుమతి పొంది శాశ్వతంగా రోడ్డు వేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి , కొడపగల్ సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి, బాబుసింగ్, రహ్మతుల్లా ఉన్నారు.


Next Story

Most Viewed