ఈ పావురం ధర రూ. 14 కోట్లు!

by  |
ఈ పావురం ధర రూ. 14 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అరుదైన జంతువులను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కొనడం అరుదేం కాదు. కానీ ఒక పావురం ధర 1.6 మిలియన్ యూరోలు (రూ. 14.11 కోట్లు) అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా! బెల్జియంలో ఇటీవల జరిగిన ఒక వేలం పాటలో పావురాన్ని అంత డబ్బు పెట్టి కొన్నారంటే అది కచ్చితంగా ఏదో మహిమ గల పావురమైనా అయ్యుండాలి లేదా ఏదైనా ప్రత్యేకత గల పావురమైనా అయ్యుండాలి. నిజానికి ఇదొక రేసింగ్ పావురం. ఈ పావురం పేరు న్యూ కిమ్. దీని వయస్సు రెండేళ్లు. గతంలో అర్మాడో అనే పావురం పేరిట గల వేలం రికార్డును ఈ న్యూ కిమ్ తిరగరాసింది. అర్మాడో 1.25 యూరోలకు అమ్ముడుపోగా, న్యూ కిమ్ 1.6 యూరోలకు అమ్ముడుపోయింది. పావురాలను పెంచుకోవడం ఒక ప్రతిష్టగా భావించే పశ్చిమ యూరప్‌లో రేసింగ్ పావురాలకు మంచి డిమాండ్ ఉంటుంది. న్యూ కిమ్ పావురాన్ని చైనాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త సొంతం చేసుకున్నట్లు వేలం నిర్వహించిన పీపా సంస్థ తెలిపింది.



Next Story

Most Viewed