స్టార్ నటి కూతురి లుక్స్‌పై బాలీవుడ్ నటుల కామెంట్స్..

268

దిశ, సినిమా: దివంగత లెజెండరీ యాక్టర్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ చిన్న కుమార్తె ఖుషీ కపూర్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన న్యూలుక్స్‌కు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఖుషీ.. అభిమానులతో పాటు బాలీవుడ్ యాక్టర్స్‌ను అట్రాక్ట్ చేసింది. ఒక అందమైన నెట్‌డ్ బ్లాక్ టాప్‌, మ్యాచింగ్ కోసం డెనిమ్ ప్యాంటు ధరించి, చెవులకు సాధారణ సిల్వర్ హోప్ పోగులు పెట్టుకోగా తన రూపూరేఖలు మారిపోయాయి. ఇక తన భుజాలపై జారవిడిచిన కురులు ఆమె అందాన్ని మరింత పెంచాయి. అయితే ఈ కొత్త లుక్‌ను అభిమానులకు పంచుకునే క్రమంలో మొదటి సెల్ఫీలో ముఖం సీరియస్‌గా పెట్టగా, రెండవ పిక్‌లో నవ్వుతూ కనిపిస్తుంది. అంతేకాదు చిత్రాలను పోస్ట్ చేస్తూ ఖుషి ‘నేను బయటకు కనిపించే విధానం, నేను లోపల ఉండే తీరు’ అని డిఫరెంట్ కాప్షన్ యాడ్ చేసింది. ఖుషీ పోస్టుకు స్పందించిన బాలీవుడ్ యాక్టర్స్ షనయా కపూర్ హార్ట్ సింబల్ ఎమోజీలను యాడ్ చేయగా, ఆలియా ‘సైడీ’ అని కళ్లుమూసుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. ఇక తన అందానికి ఫిదా అయిన అభిమానులు, స్నేహితులు తన పోస్ట్‌కు లైక్‌లు కొడుతూ కామెంట్లు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..