- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ వికెట్ తీయడం నా కల: నసీమ్
<p>దిశ, స్పోర్ట్స్: ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ వికెట్ తీయడం అంటే బౌలర్లకు కల. దిగ్గజ క్రికెటర్‌ను బౌలింగ్ ద్వారా బోల్తా కొట్టించి సంబర పడేవాళ్లు. సచిన్ రిటైర్డ్ అయ్యాడు. అతని తర్వాత ప్రతిభ ఉన్న ఎందరో బ్యాట్స్‌మెన్స్ వెలుగులోకి వచ్చారు. అందులో ఒకరు రోహిత్ శర్మ. ఆ చాంపియన్‌ను ఔట్ చేయడం తన కల అని పాకిస్తాన్ యువ బౌలర్ నషీమ్ షా అంటున్నాడు. ‘ఎలాంటి బౌలింగ్ అయినా రోహిత్ శర్మ ఆడగలడు. అతని బ్యాటింగ్ రికార్డులే […]</p>

దిశ, స్పోర్ట్స్: ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ వికెట్ తీయడం అంటే బౌలర్లకు కల. దిగ్గజ క్రికెటర్‌ను బౌలింగ్ ద్వారా బోల్తా కొట్టించి సంబర పడేవాళ్లు. సచిన్ రిటైర్డ్ అయ్యాడు. అతని తర్వాత ప్రతిభ ఉన్న ఎందరో బ్యాట్స్‌మెన్స్ వెలుగులోకి వచ్చారు. అందులో ఒకరు రోహిత్ శర్మ. ఆ చాంపియన్‌ను ఔట్ చేయడం తన కల అని పాకిస్తాన్ యువ బౌలర్ నషీమ్ షా అంటున్నాడు. ‘ఎలాంటి బౌలింగ్ అయినా రోహిత్ శర్మ ఆడగలడు. అతని బ్యాటింగ్ రికార్డులే అందుకు నిదర్శనం. రోహిత్ వికెట్ తీయడం నా జీవిత కల. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మంచి టెక్నిక్ ఉంది. అతని వికెట్ కూడా తీయాలని ఉంది.’ అని నషీమ్ అన్నాడు. నా క్రికెట్ కెరీర్‌లో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, జో రూట్ వికెట్లను తీయాలని ఉందన్నాడు. జో రూట్‌ను అవుట్ చేసే అవకాశం త్వరలో నషీమ్‌కు దక్కనున్నది. వచ్చే నెల 5 నుంచి ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ మ్యాచ్‌ల్లో జో రూట్‌ను నషీమ్ అవుట్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.






