సహారాలో హిమపాత అందాలు

by  |
సహారాలో హిమపాత అందాలు
X

దిశ, వెబ్‌డెస్క్‌: శీతాకాలంలో హిమపాతం ఎన్నో కొండ ప్రాంతాలకు సాధారణం కావచ్చు. కానీ, ‘సహారా’ ఎడారిలో మంచుపడటం నిజంగా అద్భుతమే. 37 సంవత్సరాల తర్వాత 2016లో అక్కడ మంచు పడగా, మళ్లీ నాలుగేళ్లకు అక్కడ మంచుముత్యాలు పడుతుండటంతో సహరా చుట్టూ నివసించే వారు ఆ అరుదైన దృశ్యాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో అల్జీరియా, సౌదీ అరేబియాలోని మంచుతో కప్పబడిన ఎడారి ప్రాంతాల ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

శీతాకాలం ఉదయం వేళల్లో..ఆకాశం నల్లని చీరకట్టుకోగా, చల్లని శీతల గాలుల మధ్యలో భూమి తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని మెరిసిపోతూ ఉంటే ఆ దృశ్యానికి ముగ్ధులు కానీ హృదయం ఉంటుందా ? అందులోనూ అది రేర్ నేచరల్ ఫినామినా అయితే వారికి ఇంకెంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందో వేరే చెప్పాలా! ఏ కాలమైనా సహారాలో మండుటెండ‌ల్లో ధగధగలాడే ఒయాసిస్‌లే కనిపిస్తాయి. ఎటు చూసినా ఎండకు మెరుస్తున్న ఇసుకే ద‌ర్శ‌న‌మిస్తుంది. కానీ, ఈ శీతాకాలంలో మాత్రం ఇసుక తిన్నెల్లో పరుచుకున్న హిమపాతాన్ని చూస్తున్నారు సహారా వాసులు. సహారా ఎడారిలో హిమపాతం కురుస్తుండ‌టంతో అక్క‌డ‌ ఉష్ణోగ్రతలు సబ్ జీరో సెల్సియ‌స్‌కు పడిపోగా, అక్కడి మంచు దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. అల్జీరియా ఫొటోగ్రాఫర్ కరిమ్ బౌచెటాటా తీసిన సహారాలోని యూనిక్ ఐసీ ప్యాటర్న్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట అవి ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు బిలో జీరోకు పడిపోతుండటంతో సౌదీ అరేబియా వాతావరణ కేంద్ర అధికారులు ఒంటరిగా ఐసొలేటెడ్ ప్రదేశాలకు వెళ్లకూడదని, వెచ్చగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.


Next Story