- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో ఫోటోగ్రాఫర్ మృతి
<p>దిశ,మానకొండూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మానకొండూరు మండలంలోని మానేరు ఒడ్డున ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శవం లభ్యం అయింది. నాలుగైదు రోజులుగా ఆలయం వద్ద ఓ టూవీలర్ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో వెతకగా వారికి శవం దొరికింది. మృతుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం […]</p>

X
దిశ,మానకొండూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మానకొండూరు మండలంలోని మానేరు ఒడ్డున ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శవం లభ్యం అయింది. నాలుగైదు రోజులుగా ఆలయం వద్ద ఓ టూవీలర్ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో వెతకగా వారికి శవం దొరికింది. మృతుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామానికి చెందిన కోహెడ రమేష్ గా గుర్తించారు. రమేష్ కొంతకాలంగా గోదావరిఖనిలో ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడని, అతను చివరగా తన భార్యతో మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి చావుకు గల కారణాలు ఏంటీ అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






