- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోటో ఆఫ్ ది డే : నీలిరంగులో నింగి-నేల-నీరు
<p>దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం రాత్రి అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. పెన్ గంగ పరివాహిక ప్రాంతంలో నీలి రంగులో నింగి-నేల-నీరు కనువిందు చేశాయి. సాయంత్రం వేళల్లో ఆకాశం మొత్తం నీలి రంగు కమ్ముకోవడంతో పాటు కింద ఉన్న పెన్ గంగ నదిలోని నీరు సైతం నీలి రంగులో కనిపించింది. దీంతో నింగి, నేల, నీరు ఒకటేలా కనిపించిన ఈ అరుదైన దృశ్యం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ఆదివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా సాంగిడి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం రాత్రి అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. పెన్ గంగ పరివాహిక ప్రాంతంలో నీలి రంగులో నింగి-నేల-నీరు కనువిందు చేశాయి.
సాయంత్రం వేళల్లో ఆకాశం మొత్తం నీలి రంగు కమ్ముకోవడంతో పాటు కింద ఉన్న పెన్ గంగ నదిలోని నీరు సైతం నీలి రంగులో కనిపించింది. దీంతో నింగి, నేల, నీరు ఒకటేలా కనిపించిన ఈ అరుదైన దృశ్యం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.
ఆదివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా సాంగిడి గ్రామ యువకులు పెన్ గంగ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఆవిష్కృతమైన అద్భుతాన్ని చూసి పులకించిన వారు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బందించారు. ఇప్పుడు ఈ ఫోటోలను ప్రకృతి ప్రేమికులు నెట్టింట్లో షేర్లు చేస్తూ ఆనందిస్తున్నారు.

Next Story






