కీలక నిర్ణయం.. బార్లు, వైన్స్‌లలో హత్యాచార నిందితుడి ఫొటో

325
Excise Commissioner Sarfaraz Ahmedm

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడి ఫొటోను బార్లు, వైన్స్‌లలో పెట్టాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. చిన్నారి హత్యాచారంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అన్ని జిల్లా పోలీస్ బాస్‌లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..