- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JNU రక్తపు మరకలు.. బిల్డింగ్ పై నుంచి దూకిన PHD స్కాలర్ భార్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లో ఒకటైన జవహర్ లాల్ నెహ్రూ (JNU) బిల్డింగ్ మీద నుంచి 26 ఏళ్ల మహిళ దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూడగా ఒక్కసారిగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మృతురాలి భర్త పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్నాడు. ఆయన్ను కలిసేందుకు బుధవారం JNUకు వచ్చిన మహిళ ఆ బిల్డింగ్ రెండో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లో ఒకటైన జవహర్ లాల్ నెహ్రూ (JNU) బిల్డింగ్ మీద నుంచి 26 ఏళ్ల మహిళ దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూడగా ఒక్కసారిగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మృతురాలి భర్త పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్నాడు. ఆయన్ను కలిసేందుకు బుధవారం JNUకు వచ్చిన మహిళ ఆ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై యూనివర్శిటీలో విచారణ చేయగా.. ఆమెను ఎవరూ కిందకు తోసేయలేదని.. తనంతట తానే ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, ఆమె భర్తను దీని గురించి ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






