ఏఎన్ఎంలపై లైంగిక వేధింపులు.. తాటతీసిన బంధువులు

by  |
sexual harassment
X

దిశ, ఏపీ బ్యూరో: మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా కొందరు కామాంధుల్లో బుద్ధిమాత్రం రావడం లేదు. రోజూ ఎంతోమంది మహిళలు కీచకుల వేధింపులకు.. దాడులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా రోగులకు వైద్యం అందించాల్సిన చోట ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఏఎంన్ఎంల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరానిచోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.

ఇంతియాజ్ అనే ఫార్మా అసిస్టెంట్‌ ప్రతి రోజు తమ వద్దకు వచ్చే ఏఎన్‌ఎమ్‌లను వేధింపులకు గురిచేసేవాడని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పని చేసే ఏఎన్ఎంలు మందుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు ఇంతియాజ్‌ వేధింపులకు పాల్పడుతుండటంతో అంతా కలిసి అతడి ఆటకట్టించాలనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్‌సీకు చేరుకున్న బంధువులు ఇంతియాజ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇంతియాజ్ తమను వేధిస్తున్నాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed