పీజీఈసెట్ రీషెడ్యూల్ విడుదల

by  |
పీజీఈసెట్ రీషెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్) -2020 రీషెడ్యూల్‌ను కన్వీనర్ రమేష్ బాబు బుధవారం విడుదల చేశారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఫార్మ్ డి, ఎం. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 30 వరకూ ఆన్‌లైన్ కం వెరిఫికేషన్ కోసం ఆ‌న్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు. డిసెంబర్ 3,4 తేదీల్లో ఫేజ్-1లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అదే నెల 7న కాలేజీల వారీగా మొదటి జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులు 7 నుంచి 11 వరకూ కాలేజీల్లో వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 నుంచి తరగతులు నిర్వహిస్తారు. ఫేజ్ -2 షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని కన్వీనర్ ప్రకటించారు.


Next Story

Most Viewed