ఇది పెట్రోల్ బంకా.. నీళ్ల ట్యాంకా..?

240

దిశ, వెబ్‎డెస్క్ : ఇప్పటికే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. అలాంటిది ఆ పెట్రోల్‎లో నీళ్లు దర్శనమిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్‎లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లింగంపల్లిలోని హెచ్‎పి పెట్రోల్ బంక్‎కు వెళ్లి.. తన కారులో రూ.2 వేల పెట్రోల్ కొట్టించుకున్నాడు. బంక్ దాటి కొద్ది దూరం వెళ్లగానే కారు ఆగిపోయింది. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే పెట్రోల్ ట్యాంక్‌లో నీళ్లు కనిపించాయి. ఇది చూసిన కారు యజమాని ఖంగుతిన్నాడు. అయితే సదరు కస్టమర్ వెంటనే పెట్రోల్ బంక్‌కు వెళ్లి, ఖాళీ బాటిల్‎లో పెట్రోల్ కొట్టించడంతో నీళ్లు దర్శనమిచ్చాయి. అది చూసిన కస్టమర్‎తో పాటు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన జనాలు కూడా అక్కడి సిబ్బందిని నిలదీశారు. దీంతో తాము నీళ్లు కలుపలేదని, వర్షానికి నీళ్లు వచ్చి ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో వాగ్వాదానికి దిగిన కస్టమర్‌ కారుకు రిపేర్‌ చేసి ఇస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..