- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫెలోషిప్ అక్రమాలపై పిల్ దాఖలు
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్‌ల మంజూరులో అక్రమాలు జరిగాయని పీహెచ్‌డీ విద్యార్థి కె.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటీషనర్ అభ్యర్థనను హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్‌లు మంజూరయ్యాయని పిటీషనర్ పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్ ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, ఓయూ, కేయూలకు నోటీసులు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్‌ల మంజూరులో అక్రమాలు జరిగాయని పీహెచ్‌డీ విద్యార్థి కె.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటీషనర్ అభ్యర్థనను హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్‌లు మంజూరయ్యాయని పిటీషనర్ పేర్కొన్నారు.
ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్ ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, ఓయూ, కేయూలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడువు విధించింది.
Next Story






