పెళ్లి చేసుకోమన్నందుకు.. రామారం మోడల్ స్కూల్ వెనుక దారుణం

by  |
sathish-suicide 1
X

దిశ, పాలకుర్తి : రామారం మోడల్ స్కూల్ వెనుకాల దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామారం గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన సతీష్ (27) ఆదివారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్ళాడు.

తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు. ఇంట్లో వారు అతని ఆచూకీ కోసం వెతకగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వెనకాల ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. అయితే, పెళ్లి విషయంలో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన సతీశ్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed