- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీ CMO ఎదుట నిప్పంటించుకున్న వ్యక్తి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి యోగి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి(36) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ల్యాండ్ విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో కన్నూజ్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, భూమి విషయంలో తొలుత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి యోగి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి(36) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ల్యాండ్ విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటనలో కన్నూజ్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, భూమి విషయంలో తొలుత గ్రామంలోని పెద్దను కలిసిన బాధితుడు, ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకున్నట్లు తేలింది. వారు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి ఈ చర్యకు ఒడిగడినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






