- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించి పెళ్లాడి.. దారుణంగా హత్యకు గురయ్యాడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలో మరో పరువుహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. మృతుడు నందవరం మండలం గురజాల వాసిగా గుర్తించారు. ఇదిలాఉండగా, మృతుడు ఇటీవలే మల్లీశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవ దంపతులు నెల రోజులుగా ఆదోనిలో నివాసముంటున్నారు. ఆడమ్ స్మిత్ అక్కడే ఓ నర్సింగ్ హోమ్ లో పనిచేస్తున్నాడు. డ్యూటీ అనంతరం బైకుపై ఇంటికి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలో మరో పరువుహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. మృతుడు నందవరం మండలం గురజాల వాసిగా గుర్తించారు. ఇదిలాఉండగా, మృతుడు ఇటీవలే మల్లీశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవ దంపతులు నెల రోజులుగా ఆదోనిలో నివాసముంటున్నారు. ఆడమ్ స్మిత్ అక్కడే ఓ నర్సింగ్ హోమ్ లో పనిచేస్తున్నాడు.
డ్యూటీ అనంతరం బైకుపై ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని బండరాయితో మోది హత్యచేశారు. కాగా, తన భర్తను కుటుంబసభ్యులే హత్యచేశారని మృతుడి భార్య మల్లీశ్వరి ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






