- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిక్కు తక్కువైంది.. పైసల్లేవ్ అన్నందుకు బండరాయితో మోది..!
<p>దిశ, అంబర్ పేట్ : మద్యం మత్తు అప్పటివరకు సంతోషంగా దావత్ చేసుకున్న ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పెట్టించింది. అది కాస్త ముదరడంతో ఒక స్నేహితుడు మరో వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీను(35), అంజి(36) ఇరువురు చెత్త సేకరిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఈరోజు అంబర్ పేట ముకరం హోటల్ సమీపంలోని ఖాళీ […]</p>

దిశ, అంబర్ పేట్ : మద్యం మత్తు అప్పటివరకు సంతోషంగా దావత్ చేసుకున్న ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పెట్టించింది. అది కాస్త ముదరడంతో ఒక స్నేహితుడు మరో వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీను(35), అంజి(36) ఇరువురు చెత్త సేకరిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు.
ఈరోజు అంబర్ పేట ముకరం హోటల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఇరువురు మద్యం సేవించారు. అతిగా మద్యం సేవించిన శ్రీను ఇంకొంచెం మద్యం కావాలని అంజిని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని సమాధానం అంజి చెప్పడంతో శ్రీను గొడవకు దిగాడు. ఈ గొడవ కాస్త తీవ్రతరం కావడంతో అంజి తలపై బండరాయితో బలంగా మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విపరీతమైన మద్యం సేవించిన శ్రీను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడని, హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






