కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

113

దిశ, కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర రహదారి సమీపంలోని నందిట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర తెల్లవారు జామున 4గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టవేరా వాహనాన్ని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బొంరస్ పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32) అక్కడికక్కడే మృతి చెందాడు.

కోట్ల యాదయ్య, ఆయన తమ్ముడు కోట్ల యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కొడంగల్ మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో గల యాదయ్య అత్తగారింటి వెళ్లి శంకర్ పల్లి నుంచి రిటర్న్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన పడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..