- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన హన్మకొండ కూడా కాంప్లెక్స్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. స్నేహితులు ముగ్గురు కలిసి మద్యం కొనుగోలు చేశారు. హన్మకొండ కూడా కాంప్లెక్స్ పైకి చేరుకుని పూటుగా తాగారు. ఆ తర్వాత వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి నెట్టివేయడంతో కింద […]</p>

X
దిశ, వరంగల్: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన హన్మకొండ కూడా కాంప్లెక్స్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. స్నేహితులు ముగ్గురు కలిసి మద్యం కొనుగోలు చేశారు. హన్మకొండ కూడా కాంప్లెక్స్ పైకి చేరుకుని పూటుగా తాగారు. ఆ తర్వాత వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి నెట్టివేయడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Tags: full drink, 3 mens fighting, died, alcohol
Next Story






