- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పిన బైకు.. యువకుడి మృతి
<p>దిశ, మెదక్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడగా అతన్ని వైద్యం కోసం ఆటోలో తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన వెల్దుర్లి మండల పరిధిలోని మన్నెవారి జులాలాపూర్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వెల్దుర్డీ ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. మానేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రం ( 23 ) తన తల్లి నర్సమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై వెల్దుర్లి వెళ్ళాడు. తిరిగి సాయంత్రం తన ఇంటికి […]</p>

దిశ, మెదక్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడగా అతన్ని వైద్యం కోసం ఆటోలో తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన వెల్దుర్లి మండల పరిధిలోని మన్నెవారి జులాలాపూర్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వెల్దుర్డీ ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. మానేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రం ( 23 ) తన తల్లి నర్సమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై వెల్దుర్లి వెళ్ళాడు. తిరిగి సాయంత్రం తన ఇంటికి వస్తుండగా మన్నెవారి జూలాలాపూర్ వద్ద బైక్ అదుపు తప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి నర్సమ్మకు కూడా గాయాలయ్యాయి. రామచంద్రం తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Tags: bike accident, boy, died, slip down, medak, si gangaraju






