- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నానం చేద్దామని బావిలో దిగి విగతజీవిగా మారాడు..
by Batti.Sumithra |
<p>దిశ, టేకుమట్ల : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు వ్యవసాయ బావిలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం రామకృష్ణాపురం(టీ) గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బందెల కుమార్ (39) అనే వ్యక్తి వ్యవసాయ బావిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్టు మృతుని బంధువు ఒకరు తెలిపారు. చుట్టుపక్కల స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు […]</p>

X
దిశ, టేకుమట్ల : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు వ్యవసాయ బావిలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం రామకృష్ణాపురం(టీ) గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బందెల కుమార్ (39) అనే వ్యక్తి వ్యవసాయ బావిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్టు మృతుని బంధువు ఒకరు తెలిపారు. చుట్టుపక్కల స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకుని.. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు.
Next Story






