వీడియోకాల్ చేసి లైవ్‌లో వ్యక్తి ఆత్మహత్య

63

దిశ,వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో మంగల పల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి తన భార్యకు కాల్ చేసి లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని భార్య వివరాల ప్రకారం…లక్ష్మణ్ ఇటీవల బీర్షబా సంస్థలో 3 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

ఆ సంస్థను కొద్దిరోజుల క్రితం మూసివేయడంతో లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు. దీంతో లక్ష్మణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో భార్య పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్న లక్ష్మణ్… గురువారం ఇంటికి వెళ్లివస్తానని పోసానిపేటకు వెళ్ళాడు. అదే రోజు తాను చనిపోతున్నానని భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణం తర్వాత బీర్షబా గ్రూపులో భార్య పెట్టిన వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..